స్పైస్ జెట్ విమానం పై సోను ఫోటోతో అరుదైన గౌరవం
- March 20, 2021
న్యూ ఢిల్లీ:సేవకు మారుపేరుగా నిలిచిన ప్రముఖ నటుడు సోనూసూద్ అత్యంత అరుదైన గౌరవం దక్కింది. దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ సోనుకు అత్యంత అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ బొమ్మను వేశారు. దానికి ‘‘ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూసూద్’’ అనే క్యాప్షన్ రాశారు. తెల్లటి విమానంమీద సోనుసూద్ చిత్రం..దానికి ఎర్రని అక్షరాలతో ‘‘ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూసూద్’’ అని క్యాప్షన్ పెట్టటం నిజంగా హ్యాట్సాఫ్ టూ సోనూ కదూ..
లాక్ డౌన్ సమయంలో అందించిన సహాయ సహకరాలకు గౌరవంగా.. తమ స్పైస్ జెట్ బోయింగ్ 737విమానంపై సోనూసూద్ ఫోటోను ఉంచింది. అంతేకాకుండా ఆపద్బాంధవుడు.. సోనూసూద్ కి సెల్యూట్ అని రాసింది. కాగా ఓ దేశీయ విమానయాన సంస్థ.. తన సొంత ఖర్చులతో ఓ వ్యక్తికి ఇలా గౌరవాన్ని ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.. కాగా స్పైస్‌జెట్ నుంచి లభించిన ఈ గౌరవం పట్ల సోనూ ఆనందం వ్యక్తం చేశారు. తనకి చేతనైనంత వరకు సాయం చేస్తూనే ఉంటానని తెలిపాడు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







