"మార్చి 1 నుంచి 'చుట్టాలబ్బాయి' షెడ్యూల్ రాజమండ్రిలో
- February 29, 2016
లవ్లీ రాక్‌స్టార్ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్, ఎస్.ఆర్.టి. మూవీ హౌస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో రాము తాళ్ళూరి, వెంకట్ తలారి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ మార్చి 1 నుంచి రాజమండ్రిలో ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు రాము తాళ్ళూరి, వెంకట్ తలారి మాట్లాడుతూ - "ఇటీవల మా చిత్రంలోని ఇంట్రడక్షన్ సాంగ్‌ని బ్యాంకాక్‌లో శేఖర్ మాస్టర్ సారధ్యంలో 5 రోజులపాటు చిత్రీకరించడం జరిగింది. ఇప్పుడు మార్చి 1 నుంచి తాజా షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభమవుతోంది. మార్చి 20 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది" అన్నారు.దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ - "మార్చి 1 నుంచి జరిగే తాజా షెడ్యూల్‌ను రాజమండ్రి, గోదావరి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించడం జరుగుతుంది. ఆది, నమిత ప్రమోద్ మరియు విలన్ పాల్గొనే ముఖ్యమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తాం. ఈ షెడ్యూల్లో ఒక పాటను, ఫైట్‌ను కూడా షూట్ చెయ్యబోతున్నాం. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం కోసం థమన్ చాలా ఎక్స్ట్రార్డినరీ ట్యూన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తప్పకుండా నాకు, ఆదికి మంచి సూపర్‌హిట్ సినిమా అవుతుంది" అన్నారు. లవ్లీ రాక్‌స్టార్ ఆది, నమిత ప్రమోద్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్, అభిమన్యు సింగ్, జీవా, సురేఖావాణి, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, గిరిధర్, అనితనాథ్ దితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: ఎస్.అరుణ్‌కుమార్, ఆర్ట్: నాగేంద్ర, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, మాటలు: భవాని ప్రసాద్, స్టిల్స్: గుణకర్, నిర్మాతలు: రాము తాళ్ళూరి, వెంకట్ తలారి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







