గురక పెట్టె వాళ్లకు చిట్కాలు
- March 22, 2021
నిద్ర పోతున్నప్పుడు చాలా మందికి ఎదురైయే సమస్య గురక పెట్టడం. గురక పెట్టడం వల్ల పక్కన ఉన్న వారికి నిద్రాభంగం అవుతుంది. గుర్రు పెట్టె వారిపై చిరాకు, కోపం, చూపిస్తారు. గురక రావడానికి చాల కారణాలు ఉన్నాయి అనే చెప్పాలి. నోరు మూసుకొని గురకపెడుతుంటే. నాలుక లో సమస్య ఉందనితెలుసుకోవాలి. నోరు తెరిచి గురక పెడుతుంటే. గొంతులోని మృదువైన కణజాలలో సమస్యగా భావించాలి. వెల్లకిలా పడుకుని గురక పెడితే మాత్రం ప్రధాన సమస్యగా ఆలోచించాలి .
అయితే ఎలా నిద్ర పోతున్న కూడా గురక వస్తుంటే అది తీవ్ర సమస్య గానే చెప్పాలి. గురక సమస్యకు పరిష్కారం గా ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. గ్లాసు వేడి పాలలో రెండు టీ స్పూన్లు పసుపు పొడిని కలిపి తీసుకున్నాకూడా గురక సమస్య తీరుతుంది. అర టీ స్పూన్ తేనె అలాగే అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, కలిపి రాత్రి నిద్రపోయే ముందుతాగడం వలన గురక తగ్గుతుంది. మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి రాత్రి నిద్రపోయే ముందు పది నిమిషాల పాటు ఆవిరి పడితే గురక రాకుండా ఉంటుంది. ఆవు నెయ్యిని కరిగేలా కొద్దిగా వెచ్చ పెట్టి రెండు చుక్కల చొప్పున రోజూ రెండు ముక్కు రంధ్రాలలో వేసి పీల్చితే గురక నుండి మంచి ఉపశమనం పొందవచ్చు. పయిన చెప్పిన వాటిల్లో ఏది చేసిన మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ప్రయత్నించి చూడండి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







