ఇ-బుక్ నెట్‌వర్క్‌ని ప్రారంభించనున్న ఎయిర్ పోర్టు

- March 22, 2021 , by Maagulf
ఇ-బుక్ నెట్‌వర్క్‌ని ప్రారంభించనున్న ఎయిర్ పోర్టు

షార్జా:షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం, ఏప్రిల్‌లో ఇ-బుక్ నెట్‌వర్క్‌ని ప్రారంభించనుంది. విమానంలోకి బోర్డింగ్ అయ్యేముందు ప్రయాణీకులకు ఈ బ్రౌజింగ్ సౌకర్యం అందుబాటులో వుంటుంది. తమ స్మార్ట్ డివైజ్‌లలోకి డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు చేశారు. 21 రోజుల పాటు అవి వారికి అందుబాటులో వుంటాయి. ప్రత్యేకంగా యాప్ లేదా డేటా ప్లాన్ ఏదీ ఈ పుస్తకాల డౌన్‌లోడ్ కోసం అవసరం వుండదు. ఉచిత వైఫై సర్వీస్ ద్వారానే వీటిని పొందవచ్చు. ఎయిర్ పోర్టు లోపల దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com