నివాసితులకు ఉచిత కోవిడ్ వ్యాక్సిన్...

- March 21, 2021 , by Maagulf
నివాసితులకు ఉచిత కోవిడ్ వ్యాక్సిన్...

యూఏఈ:కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం కోసం యూఏఈ కీలక నిర్ణయం తీసుకుంది.దేశ వ్యాప్తంగా ఉన్న 205 వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా..16 సంవత్సరాల వయసు పైబడిన యూఏఈ దేశ పౌరులకు,నివాసితులకు ఉచితంగా వ్యాక్సిన్‌ను అధికారులు ఉచితంగా ఇవ్వడం ప్రారంభించారు. కాగా.. టీకా పొందేందుకు ముందే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాల్సి ఉంటుందని ప్రజలకు సూచించింది.యూఏఈకి సంబంధించిన మినిస్టరీ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెన్షన్స్ (MoHAP) యాప్‌ను గూగుల్, ఆపిల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది.పేరు, ఎమిరేట్స్ ఐడీ, ఫోన్ నెంబర్ తదితర వివరాలను యాప్‌లో పేర్కొని.. దగ్గర్లోని వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎంపిక చేసుకుని, స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పింది. యాప్‌లో పేర్కొన్న సమయానికి వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లడం ద్వారా టీకా పొందొచ్చని యూఏఈ ప్రభుత్వం తెలిపింది. వృద్ధులు వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని..హోం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌ ద్వారా ఇంటి వద్దే టీకా తీసుకోవచ్చని పేర్కొంది. మరిన్ని వివరాలకు 80011111 (MoHAP), 8001717 (Department of Health – Abu Dhabi) and 800342 (Dubai Health Authority) నెంబర్లకు ఫోన్ చెయ్యగలరు. అంతేకాకుండా http://www.covidvaccineuae.com వెబ్‌సైట్ ద్వారా కూడా వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది.ప్రైవేట్ హెల్త్‌కేర్ సంస్థలు కూడా బుకింగ్‌లను అంగీకరించడం ప్రారంభించాయి.ఏదైనా సదుపాయాల కోసం VPS హెల్త్‌కేర్ హెల్ప్‌లైన్ నంబర్ 8005546 కు కాల్ చేయాలని ప్రజలను కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com