హడలెత్తిస్తున్న కుంభమేళా
- March 22, 2021
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కొనసాగుతున్న కుంభమేళా వల్ల కరోనా వ్యాపిస్తోందని, కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం.. ఉత్తరాఖండ్ రాష్ట్రానికి లేఖ రాసింది. కుంభమేళాలో క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించేందుకు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు చెందిన బృందం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హరి ద్వార్‌లో ఈ నెల 16–17 మధ్య పర్యటించింది.
కుంభమేళా జరిగిన షాహి స్నాన్ రోజుల తర్వాత స్థానికుల్లో ఉన్నట్టుండి కరోనా కేసులు పెరిగాయని తెలిపింది. కుంభమేళాకు కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. అవసరమైన మేర టెస్టులు చేయాలని, ప్రభుత్వం విడుదల చేసిన కరోనా మార్గదర్శకాలను పాటించాలని చెప్పింది. కొత్త కేసుల్లో వేగం కనిపిస్తే వెంటనే జీనోమ్ సీక్వెన్సింగ్‌కు శాంపిల్స్ పంపాలని కోరింది.
తాజా వార్తలు
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్‌లో మరో కొత్త షాపింగ్ మాల్..
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్‌లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!







