హైదరాబాద్ లో నైట్ కర్ఫ్యూ పై క్లారిటీ...
- March 22, 2021
హైదరాబాద్:తెలంగాణలో వీకెండ్స్ తో పాటు నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉన్నట్లు ప్రచారం మొదలయింది. ఎక్కడ ఎప్పుడు ఎలా మొదలయిందో తెలియని ఈ ప్రచారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. వారంలో రెండు రోజుల పాటు లాక్ డౌన్ విధించాలా? లేదంటే రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయాలా? అనే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఒకటి, రెండు రోజుల్లో దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే రాత్రి కర్ఫ్యూ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.పాత బస్తీ లోని మిర్చౌక్ ప్రాంతంలో భరోసా కేంద్రానికి పునాది వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మహమూద్ అలీ భారతదేశం అంతటా అలానే పొరుగున ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ, హైదరాబాద్ లో రాత్రి కర్ఫ్యూలు, వీకెండ్ లాక్ డౌన్ లు రాష్ట్ర ప్రభుత్వం విధించే ప్రణాళికలు ఏవీ లేవని అన్నారు.
ఈ లాక్ డౌన్ అనేది ప్రజల జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి పోలీసులు కర్ఫ్యూ విధించే ఉద్దేశం లేదని మహమూద్ అలీ పేర్కొన్నారు. కేసుల పెరుగుదల నియంత్రించడంలో ప్రజలే ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు. కర్ఫ్యూ విధించడం నగరంలోని అనేక మంది జీవితాలను, వ్యాపారాన్ని ప్రభావితం చేస్తుందని స్పష్టం చేస్తూ, మహమూద్ అలీ ప్రజలు, ముఖ్యంగా ఓల్డ్ సిటీ వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని అనవసర సమావేశాలను నివారించాలని మరియు ఫేస్ మాస్క్‌లను వెంటనే ఉపయోగించాలని అభ్యర్థించారు. పాఠశాలల్లో COVID-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, పాఠశాలలు మరియు మదర్సాలు పనిచేయనివ్వాలా ? లేదా అని రాష్ట్ర ప్రభుత్వం ఒకటి లేదా రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్‌లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్‌లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్‌లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్‌న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







