మయన్మార్: మితిమీరిన సైనిక ప్రభుత్వం అరాచకాలు
- March 22, 2021
యాంగూన్: మయన్మార్‌లో సైనిక ప్రభుత్వం అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తున్నవారిని కాల్చివేయాలన్న సైనిక ఆదేశాలతో కొందరు పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ పౌరుడిని వెంబడించిన పోలీసులు ఎటువంటి వివరాలు అడగకుండానే అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని మరికొందరు పోలీసులు వేరే ప్రాంతానికి తరలిస్తున్న దృశ్యాలు ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌తో చిత్రీకరించారు.
ఈ ఏదాడి ఫిబ్రవరి 1న మయన్మార్‌ను అదుపులోకి తీసుకున్న ఆ దేశ సైన్యం అరాచక పాలన కొనసాగిస్తోంది. సైన్యం తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నవారిపై ఉక్కుపాదం మోపుతోంది. విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. సైన్యం జరిపిన కాల్పుల్లో వందల సంఖ్యలో మృతిచెందారు. వేల సంఖ్యలో పౌరులు గాయాలపాలయ్యారు. హింసను ఆపాలంటూ ఐక్యరాజ్య సమితి హెచ్చరించినా.. వాటిని పెడచెవిన పెట్టిన సైన్యం హింసకు పాల్పడుతోంది.
తాజా వార్తలు
- విదేశీ ప్రయాణాలు చౌక.. TCS 2 శాతానికి తగ్గింపు
- సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు
- లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- హైదరాబాద్‌లో మరో కొత్త షాపింగ్ మాల్..
- ఓల్డ్ గల్ఫ్ ప్లేట్ కార్ల రిజిస్ట్రేషన్ ఫీజు యథాతథం..!!
- యూఏఈలో పెట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. Dh1,000 వరకు జరిమానాలు..!!
- కువైట్ లో సైరన్ల టెస్ట్ రన్ టైమ్ లో మార్పులు..!!
- ఖతార్‌లో ఏడు రెస్టారెంట్లతో సహా 12 ఆహార సంస్థలు మూసివేత..!!
- భారత్-అరబ్ బంధం బలోపేతం..!!
- మస్కట్ నైట్స్: ముగిసి అర్ధా ఒంటెల రేసు..!!







