భారత్ లో కరోనా కేసుల వివరాలు
- March 22, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. ప్రతీ రోజూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.24 గంటల్లో దేశవ్యాప్తంగా 11 లక్షల 33 వేల మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా...46,951మందికి పాజిటివ్‌గా తేలింది.అంతకుముందు రోజుతో పోలిస్తే సుమారు మూడు వేల కేసులు పెరిగాయి.ఇక కరోనా మరణాలు కూడా 24 గంటల వ్యవధిలో 212 నమోదయ్యాయి.అంతకుముందు రోజు 197 మరణాలు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు...రోజువారీ మరణాల్లోనూ పెరుగుదల కనిపిస్తుండటంతో...అందరిలో ఆందోళన పెరిగిపోతోంది.అధికారులు ఎన్ని సూచనలు చేస్తున్నా ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా..పరిస్థితిలో మార్పు రావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పాఠశాలలు, కాలేజీలు హాట్ స్పాట్‌లుగా మారుతున్నాయి.కరోనా బారిన పడుతున్న విద్యార్థులు, టీచర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.దీంతో భారత్ లో ఇప్పటివరకు 1,16,46,081 కేసులు నమోదయ్యాయి.ఇందులో 1,11,51,468 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 3,34,646 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్ లో 21,180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.అయితే, డిశ్చార్జ్ కేసుల కంటే, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు