'ఇక్షుశ్రీ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

\'ఇక్షుశ్రీ\' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

హైదరాబాద్:పద్మజ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై హనుమంత రావు నాయుడు, డాక్టర్ గౌతం నాయుడు సమర్పణలో  రామ్ అగ్నివేష్ హీరోగా ఋషిక దర్శకత్వంలో డాక్టర్ అశ్విని నాయుడు నిర్మించిన చిత్రం 'ఇక్షు'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో అల్లరి నరేష్ ఆవిష్కరించారు. తమ ఫస్ట్ లుక్ పోస్టర్ ని అల్లరి నరేష్ విడుదల చేయడం ఆనందం ఉందంటూ... టాకీ పార్ట్ పూర్తయిందని....త్వరలో తీయబోయే పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందంటున్నారు దర్శకనిర్మాతలు.పోస్ట్ ప్రొడక్షన్ ని వీలయినంత త్వరలో పూర్తి చేసి ఆ వెంటనే విడుదల చేస్తామంటున్నారు.రాజీవ్ కనకాల, కాలకేయ ప్రభాకర్, చిత్రం శ్రీను, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, చింటు, రీతు, రేఖ నిరోషా, ఫిద, కెప్టెన్ చౌదరి ఇందులోని ముఖ్యపాత్రధారులు.

Back to Top