జాతీయస్థాయి కబడ్డీపోటీల్లో ప్రమాదం.. వందమందికి గాయాలు
- March 22, 2021
సూర్యాపేట పట్టణంలో జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రమాదం జరిగింది. 47వ జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభం సమయంలో కబడ్డీకోర్టు చుట్టూ ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలింది. దీంతో వందమంది పైగా గాయపడ్డారు. కబడ్డీ పోటీలను చూసేందుకు వచ్చిన వారు గాయపడటంతో...వారిని 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. గేమ్ ప్రారంభానికి ముందే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో బాధితుల ఆర్ధనాధాలతో ఆ ప్రాంతం అలజడిగా మారింది. ఘటన జరిగిన సమయంలో అక్కడ మంత్రితోపాటు పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. ఘటన జరిగిన టైమ్‌లో గ్యాలరీలో 15వందల మంది ప్రేక్షకులు ఉన్నట్లు తెలుస్తోంది.



ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది, పోలీసులు స్పందించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ భాస్కరన్ శరవేగంగా స్పందించి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. పరిమితికి మించి ప్రేక్షకులు కూర్చోవడం వల్లే గ్యాలరీ కుప్పకూలినట్లు తెలుస్తోంది. కబడ్డీ పోటీలకోసం మొత్తం మూడు గ్యాలరీలను ఏర్పాటుచేశారు.దీంతో తూర్పువైపు ఉన్న గ్యాలరీ కూలిపోయింది.
తాజా వార్తలు
- రేపే డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ భార్య ప్రమాణ స్వీకారం
- ప్రభుత్వ ఉద్యోగులకు షాక్, సోషల్ మీడియా వాడాలంటే అనుమతి!
- ఇక పై గూగుల్ మీ ‘గూగ్లీ’ కి సాయం చేస్తుంది: సీఈఓ
- స్వచ్ఛ్ భారత్ స్ఫూర్తితో సముద్రాల రక్షణకు తెలుగుఈకో వారియర్స్ ఉద్యమం
- T20 ప్రపంచ కప్ 2026 కొత్త షెడ్యూల్..
- చాట్‌జీపీటీలో అమెరికా సీక్రెట్ ఫైల్స్ అప్లోడ్ చేసిన తెలుగు సంతతి వ్యక్తి?
- పోలీసులకు తప్పనిసరి సెలవులు..కర్ణాటక డీజీపీ నిర్ణయం పై ప్రశంసలు!
- ఖతార్‌లో డ్రైవింగ్ ఉల్లంఘనకు QR50,000 ఫైన్, మూడేళ్ల జైలు..!!
- అమెరికా ఉన్నతాధికారులతో సౌదీ రక్షణ మంత్రి భేటీ..!!
- దుబాయ్‌లో 200 మంది డెలివరీ రైడర్లకు సత్కారం..!!







