మహాత్మా గాంధీ ఐస్ విగ్రహం...కెనడాలో అద్భుతం

- March 22, 2021 , by Maagulf
మహాత్మా గాంధీ ఐస్ విగ్రహం...కెనడాలో అద్భుతం

కెనడాలోని ఓ ప్రముఖ హోటల్ వద్ద భారత జాతిపిత గాంధీజీ ఐస్ విగ్రహం ఏర్పాటైంది. రానున్న ఆగస్టు 15 న ఇండియా 75 వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోనుంది.  దీన్ని పురస్కరించుకుని క్యూబెక్ సిటీలోని ఈ హోటల్ ఆవరణలో ఏడు అడుగుల ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. ఇది పూర్తిగా ఐస్ తో తయారవడం  విశేషం. మార్క్ లీ పెయిర్ అనే ఐస్ ఆర్టిస్టు ఈ విగ్రహాన్ని రూపొందించాడు. టొరంటో లోని భారత దౌత్య కార్యాలయం ఈ విగ్రహ ఇమేజీని తమ అధికారిక ట్విటర్ లో షేర్ చేస్తూ లాంచింగ్ ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అంటూ పేర్కొంది. ఈ  సందర్భంగా ఈ విగ్రహావిష్కరణ గురించి వివరించింది.  75 ఏళ్ళ భారత స్వాతంత్య్ర  ఉత్సవాల నేపథ్యంలో ప్రధాని మోదీ  మార్చి 12 న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ని లాంచ్ చేశారు. ఇప్పుడు కెనడా  మన ఇండియాతో బాటు గాంధీజీకి గౌరవ పురస్కరంగా  ఈ విగ్రహాన్ని ఈ హోటల్ వద్ద ఏర్పాటు చేసినట్టు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com