పాక్షిక కర్ఫ్యూ సమయం కుదింపు
- March 23, 2021
కువైట్: కరోనా కట్టడికి పాక్షిక కర్ఫ్యూ విధించిన కువైట్..కర్ఫ్యూ సమయంలో స్వల్ప మార్పులు చేసింది. ఇన్నాళ్లు సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ పాటించారు. అయితే..ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మేరకు ఇక నుంచి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. మార్చి 23(మంగళవారం ) నుంచి ఈ నిర్ణయం అమలులో ఉంటుంది. అలాగే కర్ఫ్యూ సమయంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెస్టారెంట్లు డెలివరీ సర్వీసులను అందించొచ్చని స్పష్టం చేసింది. ఇక నివాస ప్రాంగణాల్లో సాయంత్రం 8 గంటల వరకు జనాలు బయట నడిచేందుకు అనుమతి ఉంటుంది. ఇదిలాఉంటే..వ్యాక్సిన్ తీసుకున్న వారికి క్వారంటైన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కువైట్ ప్రకటించింది. రెండు డోసులు తీసుకొని వారం రోజులు పూర్తైన వారు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే మొదటి డోసు మాత్రమే తీసుకుంటే ఐదు వారాల తర్వాతే క్వారంటైన్ నుంచి మినహాయింపు ఉంటుంది.
తాజా వార్తలు
- కెసిఆర్ కు సిట్ ఇచ్చిన నోటీసులు చెల్లవు: BRS లాయర్
- భక్తులకు టీటీడీ అలర్ట్: మార్చి 3న ఆలయం మూసివేత
- పీటీ ఉషా భర్త శ్రీనివాసన్ కన్నుమూత
- తాడేపల్లిగూడెంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదన
- డబ్డూబ్ వరల్డ్..2.5 KD ప్లే జోన్ ఆఫర్..!!
- ఫేక్ వర్క్ పర్మిట్లు.. ఎనిమిది మందికి శిక్షలు ఖరారు..!!
- ఒమన్ లో ఆర్కియాలజీపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్..!!
- సౌదీ అరేబియా జీడీపీ 4.8% వృద్ధి..!!
- జెబెల్ జైస్ జనవరి 31న రీ ఓపెన్..!!
- మెట్రోలింక్ సేవలను అప్డేట్ చేసిన దోహా మెట్రో..!!







