ఈ-స్టోర్స్ నిర్వహించుకునేందుకు స్థానికులకు అనుమతి

- March 23, 2021 , by Maagulf
ఈ-స్టోర్స్ నిర్వహించుకునేందుకు స్థానికులకు అనుమతి

బహ్రెయిన్ : స్థానికులు ఈ-స్టోర్స్ ద్వారా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు బహ్రెయిన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కార్మిక మంత్రిత్వ శాఖ, పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ-స్టోర్స్ నిర్వహించుకోవచ్చని వెల్లడించింది. అయితే..బహ్రెయిన్ పౌరులకు మాత్రమే ఈ వెసులుబాటు ఇస్తున్నట్లు బహ్రెయిన్ యువరాజు సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆధ్వర్యంలోని మంత్రివర్గం స్పష్టం చేసింది. ఆన్ లైన్ బిజినెస్ నిర్వహించే బహ్రెయినీయులకు రెండు ఆప్షన్లు ఇచ్చింది. కుటుంబ అవసరాల మేరకు చేసే ఉత్పత్తులకు సంబంధించి స్టెప్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ తరహా ఉత్పత్తులు కార్మిక, సాంఘికాభివృద్ధి మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉంటాయి. ఇక రెండో ఆప్షన్ గా సిజిలి ఎంచుకోవాల్సి ఉంటుంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వర్చువల్ కమర్షియల్ యాక్టివిటీస్ అన్ని ఈ రెండో ఆప్షన్ పరిధిలోకి వస్తాయి. అయితే..ఈ రెండు ఆప్షన్లలోనూ బహ్రెయిన్ ఎంటర్ ప్రెన్యూర్ లు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, ఫైనాన్సింగ్ ఇలా పలు ప్రయోజనాలు పొందవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com