సంతానోత్పత్తిపై వ్యాక్సిన్ ప్రభావం ఉండదని ఖతార్ క్లారిటీ

- March 23, 2021 , by Maagulf
సంతానోత్పత్తిపై వ్యాక్సిన్ ప్రభావం ఉండదని ఖతార్ క్లారిటీ

ఖతార్: కోవిడ్ వ్యాక్సిన్ తో యువతీ, యువకుల సంతానోత్సత్తి అవకాశాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తుందన్న ఆరోపణలను ఖతార్ ప్రభుత్వం కొట్టిపారేసింది. సంతానోత్పత్తి విషయంలో పురుషులు, మహిళలపై వ్యాక్సిన్ చెడు ప్రభావాన్ని చూపిస్తుంది అంటూ ఇటీవల తరచూ అనుమానాలు వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. దీంతో  ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనుమానాలు నివృత్తి చేయటంలో భాగంగా పలు సందేహాలకు సమాధానాలు ఇచ్చింది. స్త్రీ, పురుషుల సంతానోత్పత్తిపై కోవిడ్ వ్యాక్సిన్ ఏ విధంగానూ ప్రభావితం చేయదని క్లారిటీ ఇచ్చింది. వ్యాక్సిన్ తో సంతానోత్పత్తి అవకాశాలు తగ్గుతాయని చెప్పేందుకు ఎలాంటి రుజువులు, శాస్త్రీయ ఆధారాలు లేవని వెల్లడించింది. ఇదిలాఉంటే..వ్యాక్సిన్ తీసుకున్న వారు కూడా కోవిడ్ బారిన పడుతుండటంతో జనంలో వ్యాక్సిన్ ప్రభావశీలతపై కూడా ప్రశ్నలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కూడా క్లారిటీ ఇచ్చిన మంత్రిత్వ శాఖ క్లినికల్ ట్రయల్స్ లో ఫైజర్ 100 శాతం మేర ప్రభావశీలతను చాటుకుందని వెల్లడించారు. అయితే..వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కొద్ది మంది మాత్రమే వైరస్ బారిన పడుతున్నారని వివరించింది.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com