ఒమన్‌కి వెళ్ళే ప్రయాణీకులు సలాలా ద్వారా హోటల్స్ బుక్ చేసుకోవాలి

- March 25, 2021 , by Maagulf
ఒమన్‌కి వెళ్ళే ప్రయాణీకులు సలాలా ద్వారా హోటల్స్ బుక్ చేసుకోవాలి

మస్కట్:ఒమన్‌కి వెళ్ళే ప్రయాణీకులు తప్పనిసరిగా హోటల్ అకామడేషన్‌ను సహాలా వేదికగా బుక్ చేసుకోవాలనీ, మార్చి 29 నుంచి ఈ నిబంధన ఖచ్చితంగా అమలవుతుందని లండన్‌లోని ఒమన్ కల్చరల్ అటాచీ వెల్లడించింది. ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌కి అంగీకరిస్తూ, ఈ నిమిత్తం హోటళ్ళను సలాలా వేదికగా బుక్ చేసుకోవాల్సి వుంటుందని ఒమనీ కల్చరల్ అటాచీ పేర్కొంది. విదేశీ దౌత్య వ్యవహారాల నిమిత్తం పనిచేసే దౌత్య వేత్తలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు లభిస్తుంది. వారి కుటుంబాలకీ, అలాగే 15 ఏళ్ళ లోబడినవారికి, 60 ఏళ్ళు పైబడినవారికి ఐసోలేషన్ నుంచి వెసులుబాటు కల్పిస్తున్నారు. పేషెంట్లకు కూడా వారి ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో వెసులుబాటు ఇస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com