హోలీ రోజు వైన్‌షాపులు బంద్: సీపీ అంజనీ కుమార్‌

- March 25, 2021 , by Maagulf
హోలీ రోజు వైన్‌షాపులు బంద్: సీపీ అంజనీ కుమార్‌

హైదరాబాద్‌:హోలీ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లోని వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్‌ పాటించాల్సిందిగా తెలుపుతూ హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. మార్చి 28వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి మార్చి 30వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపారు.

ఇతరులకు అసౌకర్యం కలిగించడం, రోడ్లపై రంగులు చల్లడం, గుంపులుగా వాహనాలపై తిరగడం వంటి తదితర చర్యలను నిషేధిస్తూ మరో ప్రత్యేక ఉత్తర్వులు వెలువరించారు. ఈ నియమాలను ఉల్లంఘించినైట్లెతే అటువంటి వ్యక్తులు విచారణను ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com