ఏపీ:గవర్నర్ ప్రశంసలు అందుకున్న డిజిపి గౌతమ్ సవాంగ్
- March 25, 2021
విజయవాడ: దేశంలోనే ఉత్తమ డిజిపిగా స్కోచ్ అవార్డును అందుకున్న నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సవాంగ్ ను రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. గురువారం రాజ్ భవన్లో గవర్నర్ను మర్యాద పూర్వకంగా కలిసిన గౌతమ్ సవాంగ్ ఇటీవలి కాలంలో రాష్ట్ర పోలీసు శాఖ చేజిక్కించుకున్న వివిధ అవార్డులను గురించి వివరించారు. పోలీసింగ్,ప్రజా భద్రత, రాష్ట్ర పోలీసు శాఖలో సాంకేతిక సంస్కరణలను చేపట్టడం తదితర అంశాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన నేపధ్యంలో ఈ జాతీయ స్ధాయి అవార్డులు లభించించాయని డిజిపి తెలిపారు. స్మార్ట్ ఇన్నోవేటివ్ పోలీసింగ్ విభాగంలో ప్రతిష్టాత్మక ఫిక్కీ బెస్ట్ స్టేట్ అవార్డును గెలుచుకున్నామని, ఇంటర్జెరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసిజెఎస్) ద్వారా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తో అనుసంధాన పరంగా దేశంలోనే అత్యుత్తమమైనదిగా ఆంధ్రప్రదేశ్ ఎంపికైందని డిజిపి పేర్కొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో పురస్కారాలను గెలుచుకోవాలన్నారు.ప్రజా సేవ, శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసు వ్యవస్ధ ముందుకు సాగాలన్నారు.డిజిపి సవాంగ్ తో పాటు అవార్డులకు కారణమైన ఇతర పోలీసు అధికారులను గవర్నర్ హరిచందన్ అభినందించారు. గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, డిఐజి (సాంకేతిక సేవలు ) జి.పాలరాజు, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







