ఒమన్ లో ఈ నెల 28 నుంచి పాక్షిక లాక్డౌన్

- March 26, 2021 , by Maagulf
ఒమన్ లో ఈ నెల 28 నుంచి పాక్షిక లాక్డౌన్

ఒమన్ లో వైరస్ వ్యాప్తి తీవ్రత ఆందోళనకరస్థాయికి చేరింది. కోవిడ్ తో ఆస్పత్రిలో చేరుతున్న వారి తాకిడి రోజు రోజుకి పెరుగుతోంది. అలాగే ఐసీయూలోనూ కోవిడ్ పేషెంట్ల సంఖ్య ఎక్కువైంది. దురదృష్టవశాత్తు కోవిడ్ మృతుల రేటు కూడా పెరుగుతోంది. దీంతో వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలను మరింత కఠినం చేయాలని నిర్ణయించిన సుప్రీం కమిటీ..దేశవ్యాప్తంగా పాక్షిక లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్ని వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను మూసివేయాలని ఆదేశించింది. కర్ఫ్యూ సమయంలో ఎవరూ బయటికి రావొద్దని, వాహనాలకు అనుమతి ఉండదని సూచించింది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 8 వరకు లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉంటాయని వెల్లడించింది. కోవిడ్ కేసుల తీవ్రత ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ను పకడ్బందీగా అమలు చేయటమే తమ ముందున్న మార్గమని సుప్రీం కమిటీ పేర్కొంది. ఇక స్కూల్స్ నిర్వహణపై కూడా స్పష్టత ఇచ్చింది. దేశంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు ఏప్రిల్ 8 వరకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తాయని, అయితే..బ్లెండెడ్ లెర్నింగ్ సిస్టంకు లోబడి ఉన్న 12వ తరగతి విద్యార్ధులకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com