ఫేక్ ఈ-మెయిల్స్ తో జాగ్రత్త..ప్రజలకు ఎమిరేట్స్ పోస్ట్ హెచ్చరిక
- March 26, 2021
యూఏఈ: కొందరు మోసగాళ్లు ప్రభుత్వ శాఖల పేరుతో నకిలీ ఈ-మెయిల్స్ పంపించి మోసం చేస్తున్నారని ఎమిరేట్స్ పోస్ట్ ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ శాఖల పేరుతో ఫిషింగ్ ఈ-మెయిల్ పంపించి..వారి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు కావాలని కోరుతారు. ప్రభుత్వ శాఖల పేరుతో వచ్చిన మెయిల్ కనుక కొందరు బాధితులు అమాయకంగా వారి వివరాలను వెల్లడిస్తూ ఉంటారు. దీంతో బాధితుల వివరాలు తెలుసుకొని అకౌంట్లో డబ్బులు కాజేస్తుంటారని ఎమిరేట్స్ పోస్ట్ వెల్లడించింది. ప్రజలు అలాంటి నకిలీ ఈ-మెయిల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఫిషింగ్ ఈ-మెయిల్స్ పంపుతున్న మోసగాళ్లను కనుగునేందుకు సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టారని ఎమిరేట్స్ పోస్ట్ వివరించింది.

తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







