8 మంది మావోయిస్టులు హతం!
- February 29, 2016
ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గొట్టెపాడు అటవీ ప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఈరోజు ఉదయం ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు మావోయిస్టులు ఎదురుకావడంతో ఇరు వర్గాలు ఎదురుకాల్పులకు పాల్పడ్డాయి. ఈ కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతమైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి ఏకే 47 సహా 8 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా చర్ల మండలం చిన్నాపురం గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఖమ్మం జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సంఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







