నాలుగు స్కూళ్ళలో క్లాసుల్ని సస్పెండ్ చేసిన హెల్త్ మినిస్ట్రీ

- March 29, 2021 , by Maagulf
నాలుగు స్కూళ్ళలో క్లాసుల్ని సస్పెండ్ చేసిన హెల్త్ మినిస్ట్రీ

బహ్రెయిన్: అల్ దిరాజ్ బాలుర ప్రైమరీ స్కూల్, ఫాతిమా బింట్ అసద్ ప్రైమరీ బాలికల స్కూల్, అల్ రవాబి ప్రైవేట్ స్కూల్ (ప్రైమరీ), ఐబిఎన్ ఖల్దౌన్ నేషనల్ స్కూల్ (కిండర్‌గార్టెన్ మరియు ప్రైమరీ స్కూల్) లను 10 రోజులపాటు తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది మినిస్ట్రీ. విద్యార్థులకు వర్చువల్ స్టడీ అందుబాటులో వుంటుందని మినిస్ట్రీ వెల్లడించింది. కొత్తగా ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులూ వెలుగు చూడలేదని తేలేదాకా ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు అమల్లో వుంటాయి. ఇప్పటికే వున్న కేసులకు సంబంధించి క్వారంటైన్ పీరియడ్ పాటించడంతోపాటు, వారితో సన్నిహితంగా మెలిగినవారూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. స్కూళ్ళను స్టెరిలైజ్ చేయడంతోపాటు కోవిడ్ 19 ప్రికాషనరీ ప్రోటోకాల్స్ పాటించాల్సి వుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com