భారత్ లో కరోనా కేసుల వివరాలు

- March 29, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.కేసులు భారీగా పెరగడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.ఇక కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి.మాస్క్ లేకుండా బయటకు వస్తే జరిమానాలు విధిస్తున్నారు.ఇక ఇదిలా ఉంటే కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను విడుదల  చేసింది.ఈ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 68,020 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,39,664కి చేరింది.ఇందులో 1,13,55,993 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 5,21,808 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 291 మంది కరోనాతో మృతి చెందారు.దీంతో భారత్ లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,61,843కి చేరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com