కరాచి హల్వా

కరాచి హల్వా

కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ - రెండు కప్పులు, నెయ్యి - ఒక కప్పు, పంచదార - ఒక కప్పున్నర, జీడిపప్పు - పావుకప్పు, బాదంపప్పు - పావు కప్పు, కుంకుమ పప్పు - రెండు టీ స్పూన్లు, ఎసెన్స్‌ - ఒక టీ స్పూను, నీళ్లు - పావు కప్పు.

తయారుచేయు విధానం: స్టౌ మీద గిన్నె పెట్టి ఒక టేబుల్‌ స్పూను నెయ్యిలో రవ్వ వేసి వేగించుకోవాలి. తరువాత మరో గిన్నె పెట్టి మరో టేబుల్‌ స్పూను నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పుని కూడా వేగించాలి. వీటిని తీసేసి అందులో పంచదార వేసి నీళ్లు పోసి బాగా మరిగించాలి. పాకం చిక్క పడకముందే మిగిలిన నెయ్యి, రవ్వ, కుంకుమ పువ్వు వేసి గరిటతో బాగా కలపాలి. జీడిపప్పు, బాదం పప్పు, ఎసెన్స్‌ కూడా వేసి కలిపాక ఒక ప్లేటుపై వేసుకోవాలి. మనకు నచ్చిన సైజుల్లో ముక్కలు కట్‌చేసుకోవచ్చు.

Back to Top