పాన్ కార్డు-ఆధార్ కార్డు లింక్...చివరి తేదీ మార్చి 31
- March 30, 2021
న్యూ ఢిల్లీ:ఆధార్ కార్డుకు పాన్ కార్డు లింక్ చేసుకొని వారు మార్చి 30లోపల తప్పనిసరిగా చేసుకోవాలి.ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది.కనుక మార్చి 31లోపు మీ ఆధార్ కార్డుకు పాన్ లింక్ చేసుకోవాలి.ఒక వేళ లింక్ చేయకపోతే.. మీకు ఇబ్బందులు తప్పవు.మీ బ్యాంకు లావాదేవీలలో ఇబ్బందులు తలెత్తుతాయి.అంతేకాకుండా.. రూ.1,000 వరకు జరిమానా కట్టాల్సి ఉంటుంది.అయితే ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) గతేడాది ఫిబ్రవరి 13న నోటిఫికేషన్ జారీ చేసింది.మార్చి 31, 2021లో పాన్, ఆధార్ లింక్ చేసుకోవాలని సూచించింది.ఈ లోపు ఈ రెండింటిని అనుసంధానించకపోయినట్లయితే ఏప్రిల్ 1, 2021 నుంచి ఆ పాన్ కార్డు ఉన్న వ్యక్తి దగ్గర నుంచి వేయ్యి రూపాయాల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
ఒకవేళ పాన్ కార్డులు ఆర్థిక లావాదేవిలకు సంబంధించిన వాటిల్లో ఇవి కీలకంగా పనిచేస్తాయి. ముఖ్యంగా బ్యాంకు అకౌంట్ప్రారంభించేందుకు, మ్యూచువల్ ఫండ్లు, షేర్‌లలో ఇది ఎంతో ముఖ్యం. అయితే రూ. 50 వేలకు మించి నగదు లావాదేవీల సమయంలోనూ పాన్ కార్డు తప్పనిసరి అవసరం. పాన్ చెట్లుబాటులో లేకపోతే ఇవన్నీ చేయడం సాధ్యం కాదు. ఇబ్బందులు తలెత్తే అవకాశాలుంటాయి. జరిమానా చెల్లించి పాన్‌తో ఆధార్‌ను అనుసంధానం చేసుకున్నప్పుడే వీటిని అనుమతి ఇస్తారు.
పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేయాలి..
- పాన్ కార్డును ఆధార్ కార్డుతో కేవలం 2 నిమిషాల్లో లింక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఆధార్, పాన్ కార్డులలో మీ పేరు, పుట్టినతేదీలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
- ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత హోం పేజీలో పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నంబర్లు, ఆధార్ కార్డ్ మీద ఉన్న పేరు ఇవ్వాలి.
- ఆ తర్వాత ఐ అగ్రీ టు వాలిడేట్ మై ఆధార్ డీటేయిల్స్ విత్ UIDAI చెక్ బటన్ మీద్ క్లిక్ చేయాలి.
- దాని కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ సరిగ్గా టైప్ చేసి లింక్ ఆధార్ మీద క్లిక్ చేయాలి.
- అంతే క్షణాల్లో మీ ఆధార్, పాన్ కార్డులు అనుసంధానం అవుతాయి.
SMS ద్వారా లింక్ చేయడం ఎలా..
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 567678 లేదా 56161 కు SMS చేయాలి.
- ఇలా చేసేందుకు మీరు మీ మొబైల్‌లో యుఐడిపిఎన్ UIDAI (12 అంకెల ఆధార్ నంబర్) (10 అంకెల పాన్) అని టైప్ చేసి 567678 లేదా 56161 కు పంపాలి.
ఇన్‌కమింగ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఆధార్, పాన్ కార్డుల అనుసంధానం..
- ముందుగా ఇన్‌కమింగ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ యొక్క ఇ-ఫైలింగ్ పోర్టల్‌ను ఓపెన్ చేయాలి.
- ఆ తర్వాత ఎడమ వైపున ఉన్న లింక్ బేస్ విభాగంపై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్‌తోపాటు పేరు ఫిల్ చేయాలి.
- ఆ తర్వాత ‘లింక్ ఆధార్’ ఎంపికపై క్లిక్ చేయాలి. మీ పాన్ ఆధార్ లింకింగ్ పూర్తవుతుంది.
- మీ ఆధార్ వివరాలకు వ్యతిరేకంగా, ఐటి విభాగం మీ పేరు, పుట్టిన తేదీతోపాటు లింగాన్ని ధృవీకరిస్తుంది. ఆ తరువాత లింక్ చేయబడుతుంది.
తాజా వార్తలు
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- పాన్ కార్డు నిబంధనల్లో మార్పులు..ఏప్రిల్ 1 నుంచి అమలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు









