హరి హర వీరమల్లు చిత్రంలో పవర్ ఫుల్ స్టంట్
- March 30, 2021
వకీల్ సాబ్ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు అనే చిత్రం చేస్తుండగా, ఈ సినిమాకు సంబంధించి ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ఇందులో పవన్ కళ్యాణ్ లుక్ ఫ్యాన్స్ అంచనాలను అమాంతం పెంచేసింది. తొలిసారి పవన్ పీరియాడికల్ మూవీ చేస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది.
పాన్ ఇండియా సినిమాగా హరి హర వీరమల్లు అనే చిత్రాన్ని క్రిష్ తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ షూటింగ్ శరవేంగంగా జరుగుతుంది. “ధూమ్ 3”, “క్రిష్ 3” అలాగే అనేక పీరియాడిక్ సినిమాలకు స్టంట్ కొరియోగ్రఫీ చేసిన శామ్ కౌశల్.. ఇప్పుడు ఈ సినిమా కోసం సూపర్ స్టంట్స్ చేయిస్తున్నారు. తాజాగా క్రిష్ తన ట్విట్టర్ ద్వారా పవర్ స్టార్ కోసం కౌశల్ .. హై ఆక్టేన్ స్టంట్ చేయించారని పేర్కొన్నాడు. ప్రతిష్టాత్మకంగా భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్‌గా క్రిష్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









