తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- March 31, 2021 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు...ఇప్పుడు క్రమంగా పెరుగుతున్నాయి.ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.తాజాగా ప్రభుత్వం రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 684 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,07,889 కి చేరింది.ఇందులో 3,01,227 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 4,965 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక కరోనాతో రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందారు.దీంతో తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు మొత్తం 1697 మంది మృతి చెందారు.రోజు రోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను హెచ్చరించింది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com