ఎండతీవ్రతకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- March 31, 2021
వడదెబ్బ లక్షణాలు
* తలనొప్పి,తల తిరగడం, తీవ్రమైన జర్వం కలిగియుండటం మత్తునిద్ర, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి.
* స్థానిక వాతావరణ సమాచారం తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండండి. టీవి చూడండి, రేడియో వార్తలు వినండి, వార్తాపత్రికలు చదవండి.
* నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రూమాలు కట్టుకోండి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి.
* వీలైనంత వరకు ఇంట్లో ఉండటానికి ప్రయత్నించండి. దాహం వేయకపోయిన తరుచుగా నీటిని తాగండి.
* ఉప్పుకలిపిన మజ్జిగ, గ్లూకోజు, ఓ ఆర్ యస్ కలిపిన నీటిని తాగవచ్చును.
* వడదెబ్బకు గురైన వారు సాధారణ స్థితికి రానిచో, దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించండి.
* ఎండలో నుంచి వచ్చిన వెంటనే నీరు గాని , నిమ్మరసముగాని, కొబ్బరినీరు గాని తాగాలి.
* తీవ్రమైన ఎండలో బయటికి వెళ్ళినప్పుడు తలతిరుగుట, వాంతులు ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే దగ్గరలోని వైద్యుణ్ణి సంప్రదించండి.
* ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోండి. ఫ్యాను వాడండి. చల్లని నీరుతో స్నానం చేయండి.
* తక్కువ ఖర్చుతో కూడిన చల్లదనం కోసం ఇంటిపై కప్పులపై వైట్ పెయింట్, కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ ను ఉపయోగించండి.
* మేడపైన మొక్కలు, ఇంట్లో ని మొక్కలు (ఇండోర్ ప్లాంట్స్) భవనాన్ని చల్లగా ఉంచుతాయి. అదేవిదంగా ఉష్ణతాపాన్ని తగ్గిస్తాయి.
ఎండ తీవ్రతంగా ఉన్నప్పుడు చేయకూడనివి
* ఎండలో గొడుగు లేకుండా తిరగరాదు. వేసవి కాలంలో నలుపురంగు,మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.
* మధ్యాహ్నం తరువాత (మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 3గంటల మధ్యకాలంలో) బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనిచేయరాదు.
* బాలింతలు,చిన్నపిల్లలు, వృద్దులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు. వీరిపై ఎండ ప్రభావం త్వరగా చూపే అవకాశం ఉంది.
* శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ మరియు కార్బోనేటేడ్ శీతల పానీయాలు మానుకోండి. అధిక ప్రోటీన్, ఉప్ప, కారం, నూనె ఉండే పదార్దాలను తీసుకోవద్దు.
* ప్రకాశించే లైట్ బల్బులను వాడటం మానుకోండి, అవి అనవసరమైన వేడిని విడుదల చేస్తాయి.
* ఎండలో నుంచి వచ్చిన వెంటనే తేనె వంటి తీపిపదార్ధములు తీసుకొనకూడదు.
* శీతలపానీయములు మరియు ఐస్ వంటివి తీసుకుంటే అనారోగ్యము ఏర్పడుతుంది.
* ఎండ ఎక్కువగా వున్న సమయంలో వంట చేయకుండా ఉండండి. వంట గది తలుపులు మరియు కిటికీలను తీసివుంచి తగినంత గాలి వచ్చేవిదంగా చూసుకోండి.
* వడ దెబ్బకు గురైన వారిని వేడి నీటిలో ముంచిన గుడ్డతో తుడువరాదు. దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏ మాత్రం ఆలస్యం చేయరాదు.
ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు కోవిడ్ -19 దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు
* బహిరంగ ప్రదేశాల్లో ఉన్నప్పుడు కనీసం 1 మీటరు భౌతిక దూరం పాటించాలి.
* చేతులను నీరు, సబ్బుతో తరుచుగా శుభ్రపరుచుకోవాలి. నీరు,సబ్బు అందుబాటులో లేకపోతే శానిటైజర్లతో శుభ్రపరుచుకోవాలి.
* ఇంటిలోని ప్రతి సభ్యునికి తువ్వాళ్లు ఉంచాలి. వాటిని తరుచుగా శుభ్రపరుచుకోవాలి.
* ఆనారోగ్యముతో ఉన్నట్లయితే ఎండలో తిరగరాదు, డాక్టర్ని సంప్రదించాలి. ఆనారోగ్యముతో ఉన్నవాళ్ళకు దూరంగా ఉండాలి.
తాజా వార్తలు
- లోక్‌సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
- టీటీడీకి రూ.30 లక్షలు విరాళం
- సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్‌లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!









