ఏఎస్ఐ మహిపాల్ మృతి..నివాళులర్పించిన సీపీ సజ్జనార్
- March 31, 2021
హైదరాబాద్: నిజాంపేట్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనికీలు చేస్తుండగా ఓ క్యాబ్ డ్రైవర్ ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత శనివారం రాత్రి 11 గంటల సమయంలో నిజాంపేట్ రోడ్డులోని కొలను రాఘవరెడ్డి గార్డెన్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనికీలు చేశారు. ఆ సమయంలో అటుగా వచ్చిన అస్లాం అనే వ్యక్తి మద్యం మత్తులో పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులపైకి కారు దూసుకుపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏఎస్ఐ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

మహిపాల్‌రెడ్డి అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిసాయి. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించిన పోలీస్ కమిషనర్ సజ్జనార్ కాసేపు పాడే మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాబ్ డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడంతో..రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుందని అన్నారు. మహిపాల్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై మరింత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మహిపాల్‌రెడ్డి తన అవయవాలు దానం చేశారని సజ్జనార్ కొనియాడారు. ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సిన పరిహారం మహిపాల్‌రెడ్డి కుటుంబానికి అందజేస్తామన్నారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







