కరోనా తీవ్రతపై భారత్ అలర్ట్...

- April 02, 2021 , by Maagulf
కరోనా తీవ్రతపై భారత్ అలర్ట్...

న్యూ ఢిల్లీ:కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి.కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి.అక్టోబర్ తరువాత దేశంలో అత్యధిక కేసులు, మరణాలు నమోదవడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది.అన్ని రాష్ట్రాల సీఎస్ లతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు.వ్యాక్సినేషన్ ను వేగంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించారు.8 రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి వేగంగా ఉందని కేంద్ర కేబినెట్ కార్యదర్శి పేర్కొన్నారు.ఇక నిన్నటి నుంచి దేశంలో 45 ఏళ్ళు నిండిన వ్యక్తులకు కరోనా వ్యాక్సిన్ ను అందిస్తున్నారు.ఈ వ్యాక్సిన్ ను నిరంతరాయంగా సెలవు రోజుల్లో కూడా అందించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com