భారత్ లో కరోనా కేసుల వివరాలు
- April 03, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.కరోనా కట్టడికి వ్యాక్సిన్ అందిస్తున్నా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.తాజాగా దేశంలో 89,129 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,23,92,260కి చేరింది.ఇందులో 1,15,69,241 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 6,58,909 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో 44,202 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు.ఇకపోతే, గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 714 మంది మృతి చెందారు.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,64,110కి చేరింది.ఇక ఇదిలా ఉంటె, దేశంలో ఇప్పటి వరకు మొత్తం 7,30,54,295 మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్టు కరోనా బులెటిన్ లో పేర్కొన్నారు.గత ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కేసుల్లో భారీగా నమోదయ్యాయి.ఆ స్థాయిలో కేసులు మరలా ఇప్పుడు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- Saud bin Saqr receives Consul-General of Russian Federation
- దుబాయ్ పోలీసుల 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం నాలుగో వారానికి చేరిక..
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్‌కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్‌ఫామ్‌కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్‌కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?







