ఏటీఎమ్ చోరీకి యత్నించిన ఆగంతకుడు..
- April 03, 2021
హైదరాబాద్:ఏటీఎమ్ సెంటర్లపై దాడులకు దిగడం ఇటీవల మరీ ఎక్కువైపోయింది. ఓ వైపు సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా రెచ్చిపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఏటీఎమ్‌ను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ఓ దుండగుడు కెమెరా కంటికి చిక్కాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఈ రోజు ఉదయం (శనివారం) ఓ గుర్తుతెలియని వ్యక్తి ఉదయం నాలుగు గంటల సమయంలో గచ్చిబౌలిలో ఉన్న ఓ ఏటీఎమ్‌లోకి చోరీకి వెళ్లాడు. లోపలికి వెళ్లనయితే వెళ్లాడు కానీ ఏటీఎమ్‌ను ఎలా దొంగలించాలో తెలియలేదు. కాసేపు విశ్వప్రయత్నం చేసి ఎంతకూ ఏటీఎమ్ ఓపెన్ కాకపోయే సరికి అక్కడి నుంచి తిరుగు పయణమయ్యాడు. అయితే ఆ దొంగ అక్కడ సీసీ కెమెరా ఉన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోక పోవడం గమనార్హం. ఆ సీసీటీవీ ఫుటేజ్‌లో సదరు వ్యక్తి ఫుటేజ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఫొటోలను గచ్చిబౌలి పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఎవరైనా ఆ వ్యక్తిని గుర్తుపడితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్ 94906 17127 కు లేదా సైబరాబాద్ వాట్సాప్ నెంబర్ 9490617444కు సమాచారం అందించమని కోరారు. మరి ఆ దొంగపై ఓ లుక్కేయండి ఒకవేళ గుర్తు పడితే పోలీసులకు అప్పగించండి.. సమాజంలో మీ బాధ్యతను పాటించండి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!







