ఏపీలో కరోనా కేసుల వివరాలు

- April 03, 2021 , by Maagulf
ఏపీలో కరోనా కేసుల వివరాలు

అమరావతి: ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1,398 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,05,946 కు చేరింది.  ఇందులో 8,89,295 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,417 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 9 మంది మరణించారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 7,234 కి చేరింది.  గడిచిన 24 గంటల్లో ఏపీలో 787 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com