దుబాయ్‌ని ఉర్రూతలూగించనున్న 'అనిరుధ్'
- March 01, 2016
యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, దుబాయ్‌లో సంగీత ప్రియుల్ని లైవ్ కాన్సెర్ట్ ద్వారా అలరించనున్నాడు. బ్రాండ్ అవతార్ - బ్రాండింగ్ అండ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, ఏప్రిల్ 29న అనిరుధ్ లైవ్ కాన్సెర్ట్ నిర్వహించనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 29న ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అనిరుధ్ పాల్గొన్నాడు. దుబాయ్‌లో తొలిసారి లైవ్ కాన్సెర్ట్ నిర్వహించనున్నాననీ, కాన్సెర్ట్‌కి ముందే తనకు వస్తున్న ఈ రెస్పాన్స్ చూసి చాలా సంతోషిస్తున్నానని అనిరుధ్ చెప్పాడు. సంగీతాభిమానుల్ని అలరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని అన్నాడు అనిరుధ్. దుబాయ్ వాసుల నుంచి తనకు దక్కిన ఈ ఆహ్వానం పట్ల ఉబ్బితబ్బిబ్బవుతున్నట్లు అనిరుధ్ వెల్లడించాడు. ఏప్రిల్ 29న సాయంత్రం 6 గంటల నుంచి లైవ్ కాన్సెర్ట్ జరుగుతుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. 6500 సీటింగ్‌తో పవర్ ప్యాక్డ్ మ్యూజిక్ జల్సా జరగనుంది. బ్రాండ్ అవతార్ సీఈఓ హేమచంద్రన్ మాట్లాడుతూ, అనిరుధ్‌ని పవర్‌హౌస్ ఆఫ్ టాలెంట్‌గా అభివర్ణించారు. తెలుగు, తమిళ సినీ ప్రేక్షకుల్నే కాక, ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియుల్ని అలరించిన అనిరుధ్ దుబాయ్‌లో సంచలనం సృష్టించబోతున్నాడని ఆయన అన్నారు. రెహా మ్యూజిక్ మరియు డాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్ సహకారంతో బ్రాండ్ అవతార్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనుంది. 8 నుంచి 15 ఏళ్ళ గ్రూప్, 16 నుంచి 30 గ్రూప్‌లకు డాన్సింగ్, సింగింగ్, ఇన్‌స్ట్రుమెంటల్ ప్లేయింగ్ విభాగాల్లో అవకాశం కల్పిస్తారు. విజేతలకు అనిరుధ్ చేతుల మీదుగా బహుమతులు అందించనున్నారు. అలాగే, మంచి టాలెంట్ కనబర్చినవారికి అనిరుధ్‌తో కలిసి స్టేజ్‌పై పెర్ఫామ్ చేసే అవకాశం లభించనుంది.



తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







