గల్ఫ్ గడ్డపై కరోనాతో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వాసి...అక్కడే అంత్యక్రియలు
- April 04, 2021
ఒమన్: రాజన్న సిరిసిల్ల జిల్లా మారుపాక గ్రామానికి చెందిన పడిగేల కృష్ణ అనే యువకుడు గత ఐదు సంవత్సరాలుగా ఒమాన్ లో క్లీనింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వచ్చే నెలలో సెలవు పై వెళ్ళడానికి అన్ని సమకూర్చుకున్నాడు.ఇంతలో ఆరోగ్యం క్షీణించడం తో ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు కరోనా గా నిర్ధారించడం తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చ్ 28 న చనిపోగా మృతదేహాన్ని ఇండియా పంపడానికి వీలుకాకపోవడం తో సదరు కంపనీ యజమాన్యం ఒమన్ తెలంగాణ ఫ్రెండ్స్ అధ్యక్షులు నరేంద్ర పన్నీరు సంప్రదించగా వారు తమ బృందం తో అంత్యక్రియలు నిర్వహించారు.ఈ సందర్భంగా నరేంద్ర వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ మృతినికి సంబంధించిన పెండింగ్ బకాయిలు ఏమైనా ఉంటే కంపనీ తో మాట్లాడి అతని కుటుంబానికి అందేలా చూస్తానని తెలియజేసారు. ఈ అంత్యక్రియల్లో ఉపాధ్యక్షులు మంచికట్ల కుమార్, కార్యదర్శి మామిడి శ్యాం, సభ్యులు పూదరి వెంకట్రాజులు పాల్గొన్నారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

తాజా వార్తలు
- ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్
- హైదరాబాద్ లో పెరుగుతున్న ఎండలు
- ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- భారత్‌తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్‌గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!







