దశాబ్ద కాలపు సేవలను పూర్తి చేసుకున్న జీఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్

- April 05, 2021 , by Maagulf
దశాబ్ద కాలపు సేవలను పూర్తి చేసుకున్న జీఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్

రాజాం:జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగమైన జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్‌కు చెందిన జీఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్ ఇటీవల 10వ వార్షికోత్సవం జరుపుకుంది.ఈ మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలకు తక్కువ ఖర్చుతో సమగ్ర ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా, రాజాంలో 25 ఎకరాల ప్రాంగణంలో విస్తరించిన ఈ 200 పడకల ఆసుపత్రిని  2011 ఏప్రిల్ 2న గౌరవనీయ భారత మాజీ రాష్ట్రపతి, నాడు ఆర్థికమంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ మరియు నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.

NABH గుర్తింపు పొందిన ఈ ఆసుపత్రి - జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ప్రసూతి మరియు గైనకాలజీ, నియోనాటాలజీ & పీడియాట్రిక్స్, అనస్థీషియాలజీ, డెంటల్, ఈఎన్‌టీ, క్రిటికల్ కేర్, నెఫ్రాలజీ మరియు ఆప్తాల్మాలజీలో సేవలను అందిస్తోంది.

సమాజానికి సేవలను అందించడంలో దశాబ్దం గడిచిన సందర్భంగా ఈ ఆసుపత్రి 25 వేల కుటుంబాలకు ఉచితంగా పేషెంట్ కన్సెషన్ కార్డ్ (పిసిసి)లను అందిస్తోంది. దీనిని ఉపయోగించుకుని, లబ్ధిదారుడి కుటుంబంలోని ఐదుగురు సభ్యులు ఉచిత OPD సేవలు, పరీక్షలపై రాయితీ మరియు శస్త్రచికిత్స ఛార్జీలకు రాయితీ పొందవచ్చు.

"జీఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్ గత 10 సంవత్సరాలుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రజలకు తక్కువ ఖర్చులో ఆరోగ్య సౌకర్యాలను అందిస్తోంది.ఈ గొప్పపనిని మా సిబ్బంది, ప్రజల నిస్వార్థ, నిరంతర మద్దతు లేకుండా సాధించలేము. ఆసుపత్రిని జిల్లాలో అత్యుత్తమైనదిగా ఉంచడానికి నిరంతరం పనిచేసే మా సిబ్బందికి కృతజ్ఞతలు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా తక్కువ ఖర్చులో ఆరోగ్య సౌకర్యాలను అందించడానికి మేము నిరంతరం కృషి చేస్తుంటాము. ఆసుపత్రి 10వ వార్షికోత్సవం సందర్భంగా, ఈ సంవత్సరంలో మేము 25 వేల మంది నిరుపేద కుటుంబాలకు పేషెంట్ రాయితీ కార్డులు (పిసిసి) జారీ చేయబోతున్నాం” అని జీఎమ్ఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ రాజేంద్ర దామెర అన్నారు.

ఈ ఆసుపత్రిలో స్త్రీ పురుష జనరల్ వార్డులతో పాటు సర్జికల్ అండ్ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, పీడియాట్రిక్ వార్డ్ మరియు లేబర్ రూమ్‌ సేవలు అతి తక్కువ ఖర్చుతో లభిస్తాయి. OPD బ్లాక్‌లోని హాస్పిటల్ యొక్క కేంద్రీకృత ఎయిర్ కండిషన్డ్ ఔట్ పేషెంట్ కన్సల్టేషన్ గదులలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. ఇక్కడ వారానికోమారు ప్లాన్డ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్‌లనూ నిర్వహిస్తారు.

ప్రారంభమైనప్పటి నుండి, 7 లక్షల మందికి పైగా ఇక్కడ అవుట్-పేషెంట్ సేవలను పొందగా, 55,000 మంది రోగులు ఇన్-పేషెంట్ సేవలను పొందారు. అన్ని సదుపాయాలూ కలిగిన మూడు ఆపరేషన్ థియేటర్లతో ఉన్న ఈ ఆసుపత్రిలో 30,000 శస్త్రచికిత్సలు విజయవంతంగా జరగ్గా, వీటిలో 2,000 లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సలు ఉన్నాయి.

ఇక్కడ అనేక జాయింట్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సలే కాకుండా గ్రామీణ మహిళలకు లేబర్ సర్వీసులను కూడా అందించారు.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి AP రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ముందు ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య సంరక్షణ పథకం-ఆరోగ్యశ్రీకి ఈ ఆసుపత్రి అనుబంధంగా ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయాక ఆరోగ్యశ్రీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య సంరక్షణ పథకంగా మారింది. దీనిని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు.

రాష్ట్రంలో అత్యాధునిక పరికరాలను కలిగి ఉన్న అతి కొద్ది ఆసుపత్రులలో ఇది ఒకటి. ఇక్కడ సీటీ స్కానర్, డిజిటల్ ఎక్స్-రే యూనిట్లు,ఆటో ఎనలైజర్లు, అల్ట్రా సౌండ్ మెషీన్లు, 2డీ ఎకో, ఈసీజీ మెషీన్లు, లాపరోస్కోపిక్ యంత్రాలు, ఇన్ఫ్యూషన్ పంపులు, వెంటిలేటర్&అనస్థీషియా మెషీన్లు, హై ప్రెజర్ స్టీమ్ స్టెరిలైజర్స్, డీఫిబ్రిలేటర్, ఎలక్ట్రోలైట్ ఎనలైజర్, బ్లడ్ కోగ్యులేషన్ ఎనలైజర్స్, హెమటాలజీ ఎనలైజర్స్, బైనాక్యులర్ మైక్రోస్కోప్స్, ట్రినోక్యులర్ మైక్రోస్కోప్స్, ఆటోమేటెడ్ ఇమ్యునాలజీ ఎనలైజర్స్, హేమ్ డయాలసిస్ మెషీన్స్, యూరాలజీ ఎండోస్కోప్స్, లామినార్ ఫ్లో వర్క్‌స్టేషన్ & బయో-సేఫ్టీ క్యాబినెట్స్, ఆటోక్లేవ్ మెషీన్స్, డబుల్ డోర్ స్టెరిలైజర్స్ ఉన్నాయి.

ఈ హాస్పిటల్‌కు రెండు జిల్లాలలో కాంపోనెంట్ ఫెసిలిటీ కలిగిన అత్యాధునిక బ్లడ్ బ్యాంక్ ఉంది. ఇది డెంగ్యూ జ్వరాలు, పాము కాటుకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. తలసేమియా, సికిల్ సెల్ అనీమియా ఉన్న పిల్లలు సమీపంలోని బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రయోజనం పొందుతారు.

డాక్టర్ వైయస్ఆర్ ఆరోగశ్రీ హెల్త్ స్కీమ్, ఆరోగ్య భద్రత, ఇసిహెచ్ఎస్, ఎపిఎస్ఆర్సి, ఎల్ఐసి మరియు డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ వంటి ప్రభుత్వ సంస్థలతో ఎంపానెల్ చేయబడిన ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చికిత్స చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసుపత్రిని గుర్తించింది. జిహెచ్‌పిఎల్, మెడిఅసిస్ట్ మరియు పారామౌంట్ హెల్త్ సర్వీసెస్ లాంటి 15 థర్డ్ పార్టీ భీమా సంస్థలతో ఈ ఆసుపత్రి టై అప్ అయి ఉంది. 

కోవిడ్ మహమ్మారి సమయంలో, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కు అనుబంధంగా ఉన్న ఈ ఆసుపత్రి రాపిడ్ యాంటిజెన్ పరీక్షలను నిర్వహించింది. ఇక్కడ కోవిడ్ పాజిటివ్ రోగులకు కౌన్సిలింగ్ ఇవ్వడమే కాకుండా కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స కూడా అందించారు. ఈ ఆసుపత్రిని రాజాం పట్టణం మరియు సమీప ప్రాంతాలకు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంగా ప్రభుత్వం గుర్తించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com