ఆటిజం కుటుంబాలకు హెల్ప్ లైన్ నెంబర్ ఆవిష్కరించిన నాగబాబు!!
- April 05, 2021
దేశవ్యాప్తంగా ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు, వారి కుటుంబాలకు ఉచితంగా సలహాలు, గైడెన్స్ అందించడం కోసం 9100181181 హెల్ప్ లైన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత - నటుడు కొణిదెల నాగబాబు ఆవిష్కరించారు. ఈ హెల్ప్లైన్ ద్వారా ఆటిజం బాధిత కుటుంబాలు తమ పిల్లల ఆరోగ్య పరిస్థితులు వారి ఎదుగుదలలో వచ్చే మార్పులు, లోపాలు వాటి పరిష్కార మార్గానికి సంబంధించి ఉచితంగా సలహాలు, గైడెన్స్ పొందవచ్చని పినాకిల్ బ్లూమ్స్ సంస్థ వెల్లడించింది.
సహజంగా ఆటిజంతో పుట్టిన పిల్లల్లో ఎదుగుదల ఉండదని, నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉంటారని, కళ్ళల్లోకి చూసి మాట్లాడలేరని, వెలుగుని, శబ్దాన్ని కూడా భరించలేరని తెలిపింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలను చూసి తల్లిదండ్రులు సంవత్సరాల తరబడి కంటికి కునుకు లేకుండా కాపాడుతున్నారని, వారి కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని తెలిపింది. ఆటిజంతో పుట్టిన పిల్లలు శాపగ్రస్తులు కారనీ, థెరపీల ద్వారా వారు సొంతంగా తమ పనులు తాము చేసుకునేలా చేయవచ్చన్న పినాకిల్ బ్లూమ్స్ ప్రయత్నాలు విజయవంతం కావాలని నాగబాబు ఆకాంక్షించారు!!
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







