కరోనా తీవ్రత: నేటి రాత్రి నుంచి షిరిడీలో సాయి ఆలయం మూసివేత
- April 05, 2021
మహారాష్ట్రలోని షిర్డీలోని సాయిబాబా ఆలయం ఈరోజు రాత్రి 8 గంటల తర్వాత మూసివేయబడుతుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆలయం మూసివేసే ఉండనుంది. సాయిబాబా ఆలయంతో పాటు, 'ప్రసాదాలయ', 'భక్త నివాస్' కూడా మూసివేయబడతాయని తెలుస్తోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పాక్షిక లాక్ డౌన్ ప్రకటించిన క్రమంలో తర్వాత షిర్డీ ఆలయ పరిపాలన విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మాదిరిగానే తీవ్రమైన ఆంక్షలు విధించాలని రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం నిర్ణయించింది. ఈ పరిమితులు ఏప్రిల్ 30 వరకు ఉంటాయి అని చెబుతున్నారు. అలాగే, వారాంతపు లాక్ డౌన్లు కూడా రాష్ట్రం అంతా అమల్లోకి వస్తాయి. ఇక ఆ రోజుల్లో 144 సెక్షన్ రోజంతా విధించబడుతుంది. మామూలు రోజుల్లో కూడా రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల మధ్య సరైన కారణం లేకుండా పౌరులు తమ ఇంటిని వదిలి వెళ్ళలేరు. ఈ కర్ఫ్యూ నిబంధనల నుంచి అవసరమైన సేవలు మాత్రమే మినహాయించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







