ఆటిజం కుటుంబాలకు హెల్ప్ లైన్ నెంబర్ ఆవిష్కరించిన నాగబాబు!!
- April 05, 2021దేశవ్యాప్తంగా ఆటిజంతో బాధపడుతున్న పిల్లలు, వారి కుటుంబాలకు ఉచితంగా సలహాలు, గైడెన్స్ అందించడం కోసం 9100181181 హెల్ప్ లైన్ పోస్టర్ ను ప్రముఖ నిర్మాత - నటుడు కొణిదెల నాగబాబు ఆవిష్కరించారు. ఈ హెల్ప్‌లైన్ ద్వారా ఆటిజం బాధిత కుటుంబాలు తమ పిల్లల ఆరోగ్య పరిస్థితులు వారి ఎదుగుదలలో వచ్చే మార్పులు, లోపాలు వాటి పరిష్కార మార్గానికి సంబంధించి ఉచితంగా సలహాలు, గైడెన్స్ పొందవచ్చని పినాకిల్ బ్లూమ్స్ సంస్థ వెల్లడించింది.
సహజంగా ఆటిజంతో పుట్టిన పిల్లల్లో ఎదుగుదల ఉండదని, నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉంటారని, కళ్ళల్లోకి చూసి మాట్లాడలేరని, వెలుగుని, శబ్దాన్ని కూడా భరించలేరని తెలిపింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పిల్లలను చూసి తల్లిదండ్రులు సంవత్సరాల తరబడి కంటికి కునుకు లేకుండా కాపాడుతున్నారని, వారి కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని తెలిపింది. ఆటిజంతో పుట్టిన పిల్లలు శాపగ్రస్తులు కారనీ, థెరపీల ద్వారా వారు సొంతంగా తమ పనులు తాము చేసుకునేలా చేయవచ్చన్న పినాకిల్ బ్లూమ్స్ ప్రయత్నాలు విజయవంతం కావాలని నాగబాబు ఆకాంక్షించారు!!
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్