ప్రీతి జింటా ఓ ఇంటిదైంది..
- March 01, 2016
'క ల్ హో నా హో', 'క్యా కెహనా', 'వీర్ జారా' లాంటి సినిమాలతో బాలీవుడ్‌లోను, 'రాజకుమారుడు', 'ప్రేమంటే ఇదేరా' లాంటి చిత్రాలతో టాలీవుడ్‌లోనూ మంచి పేరు తెచ్చుకున్న కథానాయిక ప్రీతి జింటా. ఈ సొట్ట బుగ్గల సుందరి పెళ్లి కూతురైంది. తన బాయ్‌ఫ్రెండ్ జెనీ గుడ్‌ఇనఫ్‌ను వివాహం చేసుకొని ఓ ఇంటిదైంది. లాస్‌ఏంజిలెస్‌లో స్నేహితులు, బంధువుల సమక్షంలో నిరాడంబరంగా ఈ వేడుక నిర్వహించారు. జెనీ అమెరికాకు చెందిన హైడ్రోఎలక్ట్రిక్ విద్యుత్తు సంస్థలో సీనియర్ ఉపాధ్యక్షుడు. వీరి వివాహంపై గత కొద్దికాలంగా వార్తలు వస్తున్నా ప్రీతి ధ్రువీకరించలేదు.ఆఖరికి ప్రీతి జింటా స్నేహితుడు కబీర్ బేడీ ప్రీతికి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్‌తో పెళ్లి విషయం తెలిసింది. పెళ్లి ఎప్పుడు జరిగిందనే విషయంలో స్పష్టతలేదు. 2014లో వచ్చిన 'హ్యాపీ ఎండింగ్'లో అతిథి పాత్రలో కనిపించిన తర్వాత ప్రీతి మళ్లీ సినిమాల్లో నటించలేదు. 2008లో వ్యాపారవేత్తగా మారిన ప్రీతి ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు సహ యజమానిగా ఉంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







