భద్రత కల్పించలేం: పాక్-భారత్ మ్యాచ్‌పై
- March 01, 2016
పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా మార్చి 19న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల స్టేడియంలో జరగనున్న భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌కు భద్రత కల్పించలేమని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కేంద్ర హోంమంత్రికి ఈ విషయాన్ని లేఖ ద్వారా తెలియజేశారు. అయితే దీనిపై బీసీసీఐ కార్యదర్శి, భాజపా ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఘాటుగా స్పందించారు. ఏడాది క్రితమే టీ20 ప్రపంచకప్ జరిగే వేదికలపై బీసీసీఐ నిర్ణయం తీసుకుందని.. మ్యాచ్‌ల షెడ్యూల్ కూడా ఆరు నెలల ముందే వెల్లడించామని ఠాకూర్ తెలిపారు. టోర్నీలో అత్యంత ఆసక్తికరమైన ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను ఇప్పటికే విక్రయించామని ఈ తరుణంలో హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేయడం తగదన్నారు.పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ షహర్యార్ ఖాన్ ఇప్పటికే పాక్ క్రికెట్ జట్టు భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని భారత్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







