టీటీడీ సంచలన నిర్ణయం..
- April 07, 2021
తిరుమల: కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న నేపధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టైంస్లాట్(ఎస్ఎస్‌డి) టోకెన్ల జారీని వచ్చే సోమవారం అనగా ఏప్రిల్ 12వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలియజేసింది. తిరుపతి నగరంలో కరోనా కేసులు క్రమేపీ పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పేర్కొంది.
ప్రతీ రోజూ తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల కోసం వేల సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. దీని వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఈ పరిస్థితుల్లో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాన్ని గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరిగి సర్వదర్శనం టోకెన్ల ఎప్పుడు జారీ చేసేది ముందుగానే తెలియజేస్తామని తెలిపింది. కాగా, మహారాష్ట్రలో కరోనా కేసులు ఉధృతమవుతున్న క్రమంలో షిర్డీ ఆలయ దర్శనాన్ని కూడా నిలిపేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త







