క‌ర్ఫ్యూ నుంచి దోబీ షాపుల మిన‌హాయింపు ఇవ్వాల‌ని ఓన‌ర్ల విన‌తి‌

- April 08, 2021 , by Maagulf
క‌ర్ఫ్యూ నుంచి దోబీ షాపుల మిన‌హాయింపు ఇవ్వాల‌ని ఓన‌ర్ల విన‌తి‌

కువైట్ సిటీ:కోవిడ్ సంక్షోభంతో ఇప్ప‌టికే ఆర్ధికంగా చితికిపోయిన త‌మ‌కు క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు మ‌రింత ఆర్ధికంగా చిదిమేస్తున్నాయ‌ని కువైతీ లాండ‌రీ షాపు ఓన‌ర్ల‌ ఫెడ‌రేష‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇప్ప‌టికే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న త‌మ‌కు క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల నుంచి మిన‌హాయింపు ఇవ్వాల‌ని కోరుతూ క‌రోనా ఎమ‌ర్జెన్సీ క‌మిటీకి లేఖ రాసింది. తాము అన్ని కోవిడ్ నిబంధ‌న‌లు పాటించి షాపుల‌ను నిర్వ‌హించుకుంటామ‌ని, ప్ర‌జ‌ల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌బోమంటూ ఆ లేఖ‌లో ఫెడ‌రేష‌న్ స్ప‌ష్టం చేసింది. కోవిడ్ రేపిన ఆర్ధిక దుమారంలో ఇప్ప‌టికే చాలా మంది లాండ‌రీ ఓన‌ర్లు షాపులు మూసేసుకోవాల్సిన ప‌రిస్థితి దాపురించింద‌ని ప్ర‌భుత్వం త‌మ ప‌ట్ల ఉదారంగా ఆలోంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వేడుకున్నారు. త‌మ ఫెడ‌రేష‌న్ లో 3000 లాండ‌రీ షాపులు ఉటే కొవిడ్ సంక్షోభ కాలంలో 50 షాపులు పూర్తిగా మూత‌ప‌డ్డాయ‌ని, సిబ్బందికి జీతాలు చెల్లించ‌లేక‌ 400 లాండ‌రీ షాపుల‌ను తాత్కాలికంగా మూసివేశార‌ని ఫెడ‌రేష‌న్ మెంబ‌ర్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com