స్కూల్ స్టాఫ్ వారానికోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే!

- April 08, 2021 , by Maagulf
స్కూల్ స్టాఫ్ వారానికోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే!

దుబాయ్: ఇక నుంచి ప్ర‌తి విద్యాసంస్థ‌లోని సిబ్బంది ఖ‌చ్చితంగా ప్ర‌తి ఏడు రోజుల‌కు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేన‌ని దుబాయ్ విజ్ఞాన‌, నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారులు వెల్ల‌డించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు అన్ని అర్హ‌త‌లు ఉండి కూడా వ్యాక్సిన్ తీసుకొని వాళ్లంద‌రికి ఈ నిబంధ‌న వ‌ర్తిస్తుంద‌ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేసింది. దుబాయ్ ప‌రిధిలోని ప్రాథ‌మిక త‌ర‌గ‌తుల నుంచి యూనివ‌ర్సిటీ స్థాయి వ‌ర‌కు అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌ విద్యాసంస్థ‌లకు ఈ నియ‌మం వ‌ర్తిస్తుంది. ఆన్ లైన్ క్లాసులు చెప్పే టీచ‌ర్లు కూడా ప్ర‌తి ఏడు రోజుల‌కు ఓ సారి పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ స‌మ‌ర్పించాల్సిందే. కోవిడ్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఆ వెంట‌నే పీసీఆర్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అయితే..నిబంధ‌న‌ల మేర‌కు వ్యాక్సిన్ వేయించుకునేందుకు అర్హులు కాని వారు...ఇప్ప‌టికే ఫ‌స్ట్ డోస్ వేయించుకున్న వారికి మాత్రం పీసీఆర్ టెస్ట్ నుంచి మిన‌హాయింపు ఇచ్చిన‌ట్లు వెల్ల‌డించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com