ప్రైవేట్ వైద్య సంస్థ‌ల్లో కోవిడ్ టెస్ట్ రేట్ల‌పై ఖ‌తార్ ప్ర‌భుత్వం క్లారిటీ

- April 08, 2021 , by Maagulf
ప్రైవేట్ వైద్య సంస్థ‌ల్లో కోవిడ్ టెస్ట్ రేట్ల‌పై ఖ‌తార్ ప్ర‌భుత్వం క్లారిటీ

దోహా: కోవిడ్ సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ వైద్య సంస్థ‌ల‌పై భారం త‌గ్గించ‌టంతో పాటు..ప్ర‌జ‌ల‌కు కూడా త్వ‌ర‌త‌గతిన సేవ‌లు అందించే ఉద్దేశంతో ఖ‌తార్ ప్ర‌భుత్వం కోవిడ్ టెస్టుల‌పై కీల‌క ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇక నుంచి ప్ర‌భుత్వ వైద్య కేంద్రాల్లో విదేశాల‌కు వెళ్లే వారికి పీసీఆర్ టెస్టులు చేయ‌బోమంటూ ప్ర‌క‌టించింది. వాళ్లంద‌రూ ప్రైవేట్ వైద్య కేంద్రాల్లో టెస్టులు చేయించుకోవాల్సిందిగా స్ప‌ష్టం చేసింది. అయితే..కోవిడ్ టెస్టుల కోసం వ‌స్తున్న వారి సంఖ్య పెరుగుతుండ‌టంతో ప్రైవేట్ వైద్య కేంద్రాలు పీసీఆర్ టెస్టుల రేట్ల‌ను ఇష్టానుసారంగా వ‌సూలు చేయ‌కుండా నియంత్రించేందుకు కోవిడ్ టెస్టుల చార్జీల‌ను QR 300కి ఫిక్స్ చేసింది. అంత‌కుమించి ఎక్కువ డ‌బ్బులు వ‌సూలు చేయ‌కూడ‌ద‌ని ఆదేశించింది. అదేవిధంగా మ‌రో 40 వైద్య‌సంస్థ‌ల‌కు కోవిడ్ టెస్టులు చేసే అవ‌కాశాన్ని క‌ల్పిస్తూ అనుమ‌తి మంజూరు చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com