న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

వెల్లింగ్టన్: భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.భారత ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం విధించింది.  ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 28 వరకు భారత్ ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశ ప్రధాని జెసిందా ఆర్డెన్ పేర్కొన్నారు.  భారత్ లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు.  భారత్ ప్రయాణికులు కాకుండా, భారత్ నుంచి వచ్చే న్యూజిలాండ్ దేశస్తులపై కూడా ఈ నిషేధం అమలులో ఉంటుందని పేర్కొన్నారు.  తాజాగా ఇండియాలో 1,26,789 కరోనా కేసులు, 685 మరణాలు నమోదయ్యాయి.  ప్రపంచంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో ఇండియా టాప్ లో ఉండటం విశేషం. 

Back to Top