ఏపీలో కరోనా కేసుల వివరాలు

ఏపీలో కరోనా కేసుల వివరాలు

ఏపీలో కొత్త కరోనా కేసుల వివరాలు 


అమరావతి: ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.ఈరోజు కూడా కరోనా కేసులు రెండు వేలు దాటేశాయి.గడిచిన 24గంటల్లో 2558మందికి కరోనా సోకింది.ఇక, అదే స్థాయిలోనూ యాక్టివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో ప్రస్తుతం 14,913 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది.ఇక, గడిచిన 24గంటల్లో ఆరుగురు మృత్యువాత పడగా, మొత్తం మృతుల సంఖ‌్య 7268కి చేరింది.గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఇక, అనంతపురంలో 131, చిత్తూరులో 465, తూర్పుగోదావరిలో 58, గుంటూరులో 399, కడపలో 94, కృష్ణాలో 152, కర్నూలులో 344, నెల్లూరులో 204, ప్రకాశంలో 153, శ్రీకాకుళంలో 185, విశాఖలో 290, విజయనగరంలో 46, పశ్చిమగోదావరిలో 37 కేసులు నమోదయ్యాయి.

Back to Top