కోవిడ్ ఎఫెక్ట్ః వీకెండ్లో దోహా మెట్రో రైల్ బంద్

కోవిడ్ ఎఫెక్ట్ః వీకెండ్లో దోహా మెట్రో రైల్ బంద్

దోహా: దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతుండ‌టంతో ఖ‌తార్ ప్ర‌భుత్వం కోవిడ్ ఆంక్ష‌ల‌ను మ‌ళ్లీ క‌ఠిన‌త‌రం చేస్తోంది.ఇందులో భాగంగా ర‌వాణా స‌ర్వీసుల‌పై ఫోక‌స్ చేసింది. దోహా మెట్రోలో ఇక నుంచి పూర్తి స్థాయి సామ‌ర్థ్యంలో 20 శాతం మంది ప్ర‌యాణికుల‌నే అనుమ‌తించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది.ఇక వారంత‌పు స‌ర్వీసుల‌ను పూర్తిగా రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అంటే ఆదివారం నుంచి గురువారం వ‌ర‌కు 20 శాతం ప్ర‌యాణికుల‌తో స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయి.శుక్ర‌వారం, శ‌నివారం మాత్రం స‌ర్వీసులు రద్దు అవుతాయి. ఈ నెల 9 నుంచే ఈ నిబంధ‌న అమ‌లులోకి రానుంది. 

--రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)

Back to Top