భారత్ లాక్ డౌన్ పై క్లారిటీ...
- April 08, 2021
న్యూ ఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోన్న వేళ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ.. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్, కర్ఫ్యూ, వ్యాక్సినేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.. రెండో దశలో కరోనా వేగంగా విస్తరిస్తోందన్న ప్రధాని.. అయితే, పెరుగుతున్న కేసులను చూసి భయపడొద్దని ధైర్యాన్ని చెప్పారు.. లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసిన ఆయన.. ప్రస్తుత పరిస్థితి ఓ సవాలుగా మారుతోందన్నారు.. కోవిడ్ సెకెండ్ వేవ్‌తో మనందరం పోరాడాల్సిన అవసరం ఉంది.. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, వంటి పలు రాష్ట్రాల్లో మనుపటి గరిష్ఠ స్థాయిని మించి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయన్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ప్రజలు నిర్లక్ష్యంగా మారిపోయారన్నారు.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా అలసత్వం పెరిగిందన్న ప్రధాని.. కరోనాపై పోరాటం కోసం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.. పెద్ద ఎత్తున కరోనా టెస్టులు చేయాలని, ఈ క్రమంలో కేసుల సంఖ్య పెరిగినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎంలకు చెప్పారు.. అలాగే వ్యాక్సిన్ వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
కరోనా కట్టడికి రాష్ట్రాలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ.. కోవిడ్ టెస్ట్‌లు పెంచాలని.. ముఖ్యంగా ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య భారీగా పెంచాలన్నారు.. వ్యాక్సినేషన్ కంటే టెస్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సెకండ్ వేవ్ పై ఎవరూ నిర్లక్ష్యం వహించకూడదన్న ప్రధాని.. అందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఇక, ఏప్రిల్ 11 నుంచి 14వ తేదీ వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని పిలుపునచ్చారు.. 45 ఏళ్లు దాటినవారు వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. కోవిడ్ పెరిగినా భయం వద్దు.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఉండదని స్పష్టం చేశారు.. అయితే, రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ పెడితే మంచిదన్న ఆయన.. కరోనా కట్టడికి రాత్రి కర్ఫ్యూ ఓ ప్రత్యామ్నాయం అని.. నైట్ కర్ఫ్యూను 'కరోనా కర్ఫ్యూ'గా పిలుద్దాం అన్నారు.
తాజా వార్తలు
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు







