షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న అరబ్ వ్యక్తి అరెస్ట్
- April 09, 2021
దోహా: అర్ధరాత్రి వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా షాపుల్లోకి చోరీలకు పాల్పడుతున్న అరబ్ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఖతార్ పోలీసులు వెల్లడించారు. పారిశ్రామిక ప్రాంతంలోని పలు షాపుల్లో వరుసగా చోరీలు జరుగుతుండటం..తెల్లవారే సరికి డబ్బులు, ఇతర విలువైన వస్తువులు కనిపించకపోవటం కొన్నాళ్లుగా జరుగుతూ వస్తోంది. దీంతో ఆ ప్రాంతంలోని షాపు ఓనర్లు కొద్ది కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తూ చోరీలపై పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి దొంగను పట్టుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసేందుకు అవసరమైన అనుమతులు తీసుకొని అదుపులోకి తీసుకొని విచారించటంతో మొత్తం వ్యవహారం బయటపడింది. తన వద్ద ఉన్న పరికరాలతో అర్ధరాత్రి వేళల్లో షాపుల్లోకి చొరబడి విలువైన వస్తువులు చోరీ చేసేవాడినని...చోరీలకు అవసరమైన పనిముట్లను కూడా పోలీసులకు చూపిస్తూ నేరం అంగీకరించాడు. దీంతో చోరీలకు ఉపయోగించిన పనిముట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







